AP: ప్రపంచ తెలుగు మహాసభలకు మారిషస్ అధ్యక్షుడు ధరమ్ బీర్ దంపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ధరమ్ బీర్ ప్రసంగించారు. ‘మారిషస్లో ఉగాదిని తెలుగు సంస్కృతి, సంప్రదాయాలతో జరుపుకుంటాం. ఉగాదికి మారిషస్లో జాతీయ సెలవుగా ప్రకటించాం. మారిషస్ సంస్కృతిలో తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు అంతర్భాగం. ఏపీ అవతరణ దినోత్సవాన్ని మారిషస్లోనూ జరుపుకుంటాం’ అని ధరమ్ బీర్ వెల్లడించారు.