కోట్ల మంది రామభక్తుల కల ఇవాళ సాకారమైందని ప్రధాని మోదీ అన్నారు. ‘రామమందిర నిర్మాణానికి సహకరించిన అందరికీ నమస్కరిస్తున్నా. ఒక వ్యక్తి పురుషోత్తముడిగా ఎలా ఎదిగారో అయోధ్య చెప్తుంది. రాముడు కులం చూడడు.. భక్తి మాత్రమే చూస్తాడు. ఆదర్శ పురుషుడైన శ్రీరాముడికి బేధభావాలు ఉండవు. శతబ్దాల నాటి గాయాలకు ఇవాళ ఉపశమనం లభించింది. ఐదు శతాబ్దాల సమస్య పరిష్కారమైంది’ అని తెలిపారు.