AP: గుంటూరు జిల్లాలో రేపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటించనున్నారు. ఉదయం 11:20 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుని.. రోడ్డు మార్గంలో మంగళగిరి ఎయిమ్స్‌కు చేరుకుంటారు. MBBS తొలి (2018) బ్యాచ్ విద్యార్థుల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి రాష్ట్రపతి పురస్కారాలు ప్రదానం చేస్తారు. కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, CM చంద్రబాబు, కేంద్రమంత్రి ప్రతాపరావు జాదవ్, మంత్రులు సత్య కుమార్, నారా లోకేష్ హాజరుకానున్నారు.