TG: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ కొనసాగుతోంది. అయితే ఇవాళ, రేపు జరగాల్సిన విచారణను స్పీకర్ గడ్డం ప్రసాద్ వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఈ విచారణను ఈ నెల 14, 15 తేదీల్లో నిర్వహించనున్నట్లు సమాచారం. కాగా షెడ్యూల్ ప్రకారం ఇవాళ తెల్లం వెంకట్రావు, సంజయ్ పిటిషన్లపై.. రేపు పోచారం, అరికెపూడి గాంధీని మరోసారి విచారించాల్సి ఉంది.