తిరుపతి నుంచి పాకాలకు కారులో వెళుతున్న ఓ వ్యక్తి గాదెంకి టోల్ ప్లాజా దగ్గర కారు నిలిపి వ్యక్తిగత పనులు ముగించుకున్నాడు. తిరుగు ప్రయాణంలో ల్యాప్ టాప్ మరిచిపోయాడు. దీంతో విధుల్లో ఉన్న చంద్రగిరి హోంగార్డు గిరి గమనించి ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకుని సమాచారాన్ని సీఐ సురేష్‌కు తెలిపాడు. అనంతరం సీఐ బాధితుడుని పిలిపించి ల్యాప్ టాప్ అప్పగించారు.