TG: నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్ డ్యామ్‌పై CRPF భద్రత తొలగించారు. అయితే, డ్యామ్ భద్రతను SPF ఆధీనంలోకి తీసుకున్నారు. కాగా, 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి ఇప్పటివరకు ప్రాజెక్టు కేంద్ర బలగాల పహారాలో ఉంది. పోలింగ్‌కు ముందు అర్ధరాత్రి డ్యామ్‌పై ఇరు రాష్ట్రాల భద్రతా బలగాల మధ్య హైడ్రామా నడిచింది. అప్పట్లో ఈ ఘటన రాజకీయంగా దుమారం రేపింది.