ప్రకాశం: ఒంగోలు నగరపాలక సంస్థలో ఉన్న ఎన్టీఆర్ భరోసా ఫించన్ లబ్దిదారులకు ఈ నెల 31, జనవరి రెండో తేదీన పింఛన్ నగదు పంపిణీ చేయనున్నట్లు కమిషనర్ కె.వెంకటేశ్వరరావు తెలిపారు. ఒకటో తేదీ నూతన సంవత్సరం కావడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒకరోజు ముందే పంపిణీ చేపడతామన్నారు. వార్డు సచి వాలయ, నగరపాలక సిబ్బంది ఉదయం 5.30 నుంచి ఇళ్ల వద్దకు వెళ్లి నగదు పంపిణీ చేస్తారన్నారు.