కృష్ణా: డిప్యూటీ సీఎం పర్యటనలో నకిలీ పోలీస్ అధికారి హల్చల్ ఘటనపై పెనమలూరు జనసేన పార్టీ ఇంఛార్జ్ ముప్పా రాజా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కి ప్రత్యేక సెక్యూరిటీని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి, నిర్లక్ష్యం వహించిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.