AP: అల్లు అర్జున్ వ్యవహారంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఓ జర్నలిస్టు అల్లు అర్జున్ అరెస్టు గురించి ప్రశ్నించగా.. మనుషులు చనిపోతుంటే సినిమాలు ఎక్కువా? అని మండిపడ్డారు. సినిమాల కంటే పెద్ద విషయాలు చాలా ఉన్నాయని తెలిపారు. జరుగుతున్న అరాచకాల గురించి మాట్లాడాలని పేర్కొన్నారు. కొంచెం పెద్ద మనసుతో ఆలోచించండి.. పెద్దగా ఆలోచించండి అని హితవు పలికారు.