గర్భంతో ఉన్న సమయంలో బిడ్డ ఎదుగుదలను బట్టి పొట్ట సాగుతుంది. ప్రసవానంతరం పొట్ట మాములు స్థితిలోకి రావాలి కానీ కొంతమందికి ఎత్తుగా ఉంటుంది. అయితే కొన్ని సహజపద్ధతుల ద్వారా పొట్ట తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. రోజూ పరగడుపున గోరువెచ్చని నీళ్లు, గ్రీన్ టీ తాగాలి. మూడు లవంగాలు, దాల్చిన చెక్క ముక్కను నీటిలో వేసి 10 నిమిషాలు మరిగించి తయారు చేసిన మిశ్రమాన్ని వరుసగా 40 రోజులు తాగాలి. యాపిల్ పండు తినాలి.