రోజూ స్నానం చేయడంతో మనం వాడే కెమికల్ సబ్బుల వల్ల చర్మం పొడిబారుతుందట. తద్వారా దురద, చర్మంపై పగుళ్లు ఏర్పడి దాని ద్వారా చెడు బ్యాక్టీరియా లోపలికి ప్రవేశిస్తుంది. అంతేకాకుండా చర్మంపై ఉండే ఆరోగ్యకరమైన నూనెలు, బ్యాక్టీరియాను చంపేస్తుంది. కావున కెమికల్స్ లేకుండా ఉండే తేలికపాటి సబ్బు, తేలికపాటి క్లెన్సర్ షవర్ జెల్ స్నానానికి ఉపయోగించాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే తడి తువ్వాళ్లు కూడా వాడవద్దని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.