మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ నేత దేవేంద్ర ఫడణవీస్ ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో స్కూల్లో ఉన్నప్పుడు దేవేంద్ర ఎలా ఉండేవారో ఆయనకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయురాలు సావిత్రి సుబ్రమణియం గుర్తుచేసుకున్నారు. ఎత్తుగా ఉండటంతో.. బ్యాక్ బెంచ్‌లలో కూర్చునేవాడని, చదువులో యావరేజీ అని, చాలా మర్యాదగా ప్రవర్తించేవాడని, సాయం చేయడంలో ముందుండేవాడని సావిత్రి వెల్లడించారు.