AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే, పవన్ సోదరుడు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఇప్పటికే నిర్ణయించడంతో ఏ శాఖ కేటాయించాలన్న దానిపై, నామినేటెడ్ పదవుల జాబితా, ఇతర అంశాలపైనా చర్చించినట్లు సమాచారం. కాగా, ప్రమాణస్వీకారం తర్వాత నాగబాబును ఎమ్మెల్సీగా ఎన్నుకునే అవకాశం ఉంది.