AP: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైసీపీ చేస్తున్న ర్యాలీలను అడ్డుకోవడంపై మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘తాడిపత్రికి జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి గ్యాంగ్స్టర్లుగా వ్యవహరిస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఫ్యాక్షన్ చేస్తానని వారంటున్న మాటలకు అవకాశం వస్తే నేనంటే ఏంటో చూపిస్తా’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.