SS: సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో వచ్చే భక్తుల సౌకర్యార్థం నేటి నుంచి ఈనెల 23 వరకు పుట్టపర్తి రైల్వే స్టేషన్ నుంచి శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం వరకు ఉచిత బస్సులను నడుపుతున్నట్టు జిల్లా ప్రజా రవాణా అధికారి తెలిపారు. ప్రభుత్వం, కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక సేవను భక్తులు వినియోగించుకోవాలని ఆయన సూచించారు.