కృష్ణా: పోలుకొండ జిల్లా పరిషత్ హై స్కూల్లో బాలల దినోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి డేవిడ్ రాజు ఐడి కార్డ్స్, ఉత్తమ క్రమశిక్షణతో మెలిగిన విద్యార్థులకు మొమెంటోస్ గోల్డ్ మెడల్స్‌ను విద్యార్థులకు అందజేశారు. విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని సూచించారు.