AKP: నర్సీపట్నం డీఎస్పీ పోతిరెడ్డి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శుక్రవారం పోలీసులు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులతో పాటు ర్యాలీలో రూరల్ సీఐ రేవతమ్మ, టౌన్ సీఐ గోవిందరావు, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు మాదకద్రవ్యాలను రూపుమాపేందుకు పోలీసులకు సహకరించాలని కోరారు.