NLG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అత్యధిక మెజారిటీతో గెలుపొందడంతో కొండమల్లేపల్లిలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ప్రధాన రహదారిపై భారీ ర్యాలీ నిర్వహించి, చౌరస్తాలో బాణసంచా కాల్చి, స్వీట్లు పంచుకున్నారు. ఈ గెలుపుతో ప్రజలు కాంగ్రెస్ పార్టీని మరోసారి విశ్వసించారని మండల అధ్యక్షుడు వేమన్ రెడ్డి అన్నారు.