NLR: బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి సంపూర్ణ మెజారిటీ సాధించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఇందుకూరుపేట బీజేపీ మండల నేతలు సంబరాల నిర్వహించారు. టపాసులు పేల్చి మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నేత కైలాసం శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాని మోదీ పాలన, సంక్షేమం అభివృద్ధికి బీహార్ ప్రజలు మద్దతు తెలిపారని కొనియాడారు.