NLG: మత్స్య కార్మికుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు అన్నెబోయిన సుధాకర్ అన్నారు. ఇవాళ మాధవరం కలాన్‌లోని రామసముద్రం చెరువులో జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేప పిల్లలను చెరువులోకి వదిలారు. మత్స్య కార్మికులు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు ప్రభుత్వం రూ.6 లక్షలకు పైగా చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేసిందని పేర్కొన్నారు.