సత్యసాయి: పుట్టపర్తిలో జరగనున్న సత్యసాయి శత జయంతి ఉత్సవాల దృష్ట్యా ఈనెల 17న నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్ ప్రకటించారు. ఉత్సవ ఏర్పాట్లు సజావుగా సాగేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అర్జీదారులు ఫిర్యాదులు సమర్పించేందుకు కలెక్టరేట్ రావొద్దని ఆయన సూచించారు.