AP: ఆడుదాం ఆంధ్రాపై విచారణ పూర్తయిందని, త్వరలోనే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలోనే క్రమశిక్షణ కలిగిన పార్టీ టీడీపీ అని, ఎవరు తప్పు చేసినా పారదర్శకంగా చర్యలు తీసుకుంటామన్నారు. పార్టీ అధిష్టానానికి అందరూ సమానమేనని అన్నారు. ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం ద్వారా వైసీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో విచారణ చేశామన్నారు.