ఫుదుచ్చేరిలో ఇవాళ కేంద్రమంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. మన్నడిపేటలో బహిరంగ సభకు హాజరై ప్రసంగిస్తారు. మన్నడిపేట నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి అమిత్ షా పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించారు. కేంద్రపాలిత ప్రాంతంలో ఏప్రిల్ 9న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం పలువురు కేంద్ర మంత్రులను రంగంలోకి దించాలని బీజేపీ యోచిస్తోంది.