TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కౌంటింగ్ రసవత్తరంగా కొనసాగుతోంది. 7వ రౌండ్లోనూ కాంగ్రెస్ 19,619 ఓట్ల ఆధిక్యంలో దూసుకెళ్తోంది. వరుసగా 6 రౌండ్లలోనూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ లీడ్లో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ 2వ స్థానంలో ఉండగా, బీజేపీ మూడో స్థానానికే పరిమితమైంది. కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు దిశగా దూసుకెళ్లడంతో ఆ పార్టీ నేతలు సంబురాలు చేసుకుంటున్నారు.