TG: తబలా విద్వాంసుడు మహమ్మద్ జాకీర్ హుస్సేన్ మరణం పట్ల సీఎం రేవంత్ సతాపం తెలియజేశారు. జాకీర్ హుస్సేన్.. తండ్రి అల్లారఖా బాటలో నడుస్తూ తబలా వాయిద్యం పట్ల, హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో తనదైన ముద్ర వేసుకుంటూ అంతర్జాతీయ ఖ్యాతి గడించాయని గుర్తుచేశారు. ఆయన మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటు అని పేర్కొన్నారు. జాకీర్ హుస్సేన్ మరణం పట్ల సీఎం విచారం వ్యక్తం చేస్తూ.. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాని అన్నారు.