TG: మహిళలకు ఓటు హక్కు ఇవ్వడానికి 150 ఏళ్లు పట్టిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘మహిళలకు ఓటు కల్పించింది కాంగ్రెస్. దేశ అభివృద్ధిలో మహిళలను భాగస్వాములను చేసింది. మహిళల ఆధ్వర్యంలో పాలనను కాంగ్రెస్ ప్రోత్సహించింది. చట్టాలు, శాసనసభలో మహిళల ప్రాతినిధ్యం ఉండాలి. మహిళలు, చిన్నారుల రక్షణకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. మహిళల పట్ల ఉన్న వివక్ష ఒక్కరోజులో పోయేది కాదు’ అని అన్నారు.