కారణం ఏదైనా జుట్టు రాలే సమస్యతో చాలామంది సతమతమవుతుంటారు. దీనికి జామాకుతో చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. జామాకుల్లోని విటమిన్-సి జుట్టు ఆరోగ్యంగా, ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. లీటరు నీటిలో జామాకులు వేసి 20 నిమిషాలు మరిగించి, ఆ నీటిని కుదుళ్లకు పట్టించాలి. రెండు గంటలు అలాగే వదిలేసి తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే వెంట్రుకలు మృదువుగా మారతాయి. ఈ ఆకులతో హెయిర్ ప్యాక్ వేసుకుంటే చుండ్రు సమస్య తగ్గుతుంది.