AP: విజయనగరంలో ఇవాళ పైడితల్లి సిరిమానోత్సవం ప్రారంభంకానుంది. మధ్యాహ్నం 3 గంటలకు ఈ వేడుకలు ప్రారంభంకానున్నాయి. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పైడితల్లి అమ్మవారికి పట్టు వస్రాలు సమర్పించనున్నారు. హుకుంపేట నుంచి సిరిమాను రథాలు కదలనున్నాయి. ఈ ఉత్సవానికి 5 లక్షలకు మందికిపైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈమేరకు ఏర్పాట్లు పూర్తి చేశారు.