అల్లు అర్జున్ అరెస్ట్‌పై మాజీమంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘జాతీయ పురస్కారం అందుకున్న స్టార్ అరెస్టయ్యాడు. పాలకుల అభద్రతాభావానికి ఇది పరాకాష్ట. జరిగిన ఘటనకు నేరుగా బాధ్యుడు కాని అల్లు అర్జున్ను సాధారణ నేరగాడిలా ట్రీట్ చేయటం సరికాదు. ప్రభుత్వ తీవ్ర చర్యను ఖండిస్తున్నా. హైడ్రా కూల్చివేతలతో ఇద్దరి చావుకు కారణమైన రేవంత్ రెడ్డిని కూడా ఇదే లాజిక్‌తో అరెస్ట్ చేయాలి’ అని డిమాండ్ చేశారు.