TG: పెద్దపల్లి-రాఘవాపూర్ మధ్య రైలు పట్టాలు తప్పిన ఘటనపై కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరా తీశారు. దక్షిణ మధ్య రైల్వే అధికారులకు ఫోన్ చేసి మాట్లాడారు. ఈ ఘటనలో 3 రైల్వే ట్రాక్లు దెబ్బతిన్నాయని, రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు. వీలైనంత త్వరగా రైల్వే ట్రాక్లని పునరుద్ధరించాలని అధికారులను కేంద్రమంత్రి కోరారు.