కృష్ణా: గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం ఆధ్వర్యంలో ఈనెల 21వ తేదీన ఎన్టీఆర్ మెమోరియల్ వారు ఉమ్మడి జిల్లాల ఓపెన్ వెయిట్ లిఫ్టింగ్ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని స్టేడియం ఉపాధ్యక్షుడు యలవర్తి శ్రీనివాసరావు తెలిపారు. పురుషులు, స్త్రీలకు వేర్వేరుగా ఈ పోటీలు జరుగుతాయని ఆయన చెప్పారు. క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన వెల్లడించారు.