ప్రముఖ ఈవీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ తన ప్రీమియం మోటార్ సైకిల్ రోడ్‌స్టర్ ధరను భారీగా తగ్గించింది. 4680 భారత్ సెల్‌పై రూపొందిన ఈ బైక్ ధరను ఏకంగా రూ.60 వేలు తగ్గిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం దీని ధర రూ.1,89,999 ఉండగా.. రూ.1,29,999కు తగ్గిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. రేపు సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు కొనుగోలు విండోను తెరవనున్నట్లు ఓలా ప్రతినిధి తెలిపారు.