బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశానికి ఏది అవసరమో అది చేయకుండా.. అవసరం లేని వాటిపై దృష్టి సారిస్తుందని ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ మండిపడ్డారు. ప్రస్తుతం దేశానికి ‘ఒకే దేశం.. ఒకే ఎన్నికలు’ అవసరం లేదని.. ‘ఒకే దేశం- ఒకే విద్య’, ‘ఒకే దేశం-ఒకే ఆరోగ్య వ్యవస్థ అవసరమని తెలిపారు. కేంద్రం ఒకే విద్య, ఆరోగ్య వ్యవస్థలపై దృష్టి సారిస్తే దేశ ప్రజలకు ఎంతో మేలు కలుగుతుందని వెల్లడించారు.