TG: మతపరమైన దీక్షలపై పోలీస్ శాఖ జారీ చేసిన ఆదేశాలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. సెలవు పెట్టుకుని మాల వేసుకోవాలి అని పోలీసులకు నిబంధనలు పెట్టడం సరైంది కాదని మండిపడ్డారు. అయ్యప్ప దీక్ష సమయంలోనే పోలీసులకు నియమ నిబంధనలు గుర్తుకు వస్తాయా? అని ప్రశ్నించారు. ముస్లిం పోలీసులకు చాలా ఫ్రీడమ్ ఇచ్చి హిందూ పోలీసులకు ఎందుకు ఇవ్వట్లేదు? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.