బీహార్లో ఒకప్పుడు అరాచక శక్తులు, నక్సలైట్ల ప్రభావం ఉండేదని.. మధ్యాహ్నం 3 గంటలకే పోలింగ్ ముగిసేదని PM మోదీ గుర్తు చేశారు. అయితే ఇప్పుడు ప్రజలంతా స్వేచ్ఛగా, రికార్డు స్థాయిలో ఓటు వేశారని అన్నారు. ఎన్నికల హింస, రీపోలింగ్ వంటి సమస్యలు లేకుండా సజావుగా పోలింగ్ జరగడానికి ‘జంగల్రాజ్’ పోవడమే కారణమని స్పష్టం చేశారు. ఈ మార్పు సుపరిపాలనకు నిదర్శనమని స్పష్టం చేశారు.