TG: CPI సీనియర్ నేత సురవరం సుధాకర్ రెడ్డి అనారోగ్య సమస్యతో నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు. 1942 మార్చి 25న మహబూబ్నగర్ జిల్లా కొండ్రావుపల్లిలో ఆయన జన్మించారు. 1966లో AISF జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 1970, 1972లో AISF జాతీయ అధ్యక్షునిగా ఎంపికయ్యారు. 1988, 2004లో నల్గొండ ఎంపీగా గెలిచారు. 2012 నుంచి 2019 వరకు సీపీఐ జాతీయ ప్రధానకార్యదర్శిగా పనిచేశారు.