మహారాష్ట్ర ఆపద్ధర్మ సీఎం ఏక్నాథ్ షిండే అస్వస్థతకు గురయ్యారు. ఆయన ఆరోగ్యం కుదుటపడకపోవటంతో థానేలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గత కొద్ది రోజులుగా షిండే అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. మరోవైపు మహారాష్ట్ర సీఎం అభ్యర్థిపై మహాయుతి కూటమి రేపు మరోసారి చర్చలు జరపనుంది.