రాజ్యసభను ప్రతిపక్ష MPలు వాకౌట్ చేశారు. పంటలకు కనీస మద్దతు ధర సహా రైతులకు సంబంధించిన వివిధ సమస్యలపై సభలో చర్చించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. అంతేకాకుండా అదానీ అంశం, సంభల్ వివాదం, ఫెంగల్ తుఫాను నష్టంపై చర్చించాలంటూ ఐదుగురు MPలు నోటీసులు ఇవ్వగా.. అందుకు రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ నిరాకరించారు. దీంతో పలువురు MPలు వెల్లోకి వెళ్లి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం సభను వాకౌట్ చేసి వెళ్లారు.