శీతాకాలంలో చలి కారణంగా, దోమల బెడద వల్ల కొంతమంది దుప్పటిని నిండుగా కప్పుకుని నిద్రపోతుంటారు. అయితే ముఖం పైవరకు దుప్పటి కప్పేసి పడుకోవటం ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. అలా చేయటం వల్ల మనం వదిలే కార్బన్డైయాక్సైడ్ని మళ్లీ పీలుస్తాం. కాబట్టి శరీరానికి తగినంత ఆక్సిజన్ అందదు. దీంతో రక్తప్రసరణ సరిగా జరగదు. తలనొప్పి, వికారం, అలర్జీ, హృద్రోగ సమస్యలు వస్తాయి. మెదడు, రక్తనాళాల పనితీరు దెబ్బతింటుంది.