కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ నేతృత్వంలో ఈసీ బృందం వచ్చే నెల 4, 5 తేదీల్లో బీహార్ రాజధాని పాట్నాలో పర్యటించనుంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎన్నికల సన్నద్ధతను సమీక్షించనుంది. 243 మంది సభ్యులు గల బీహార్ శాసనసభ గడువు నవంబర్ 22తో ముగియనున్న నేపథ్యంలో నవంబర్లో రాష్ట్ర శాసనసభ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది.