TG: HYDని గ్లోబల్ సిటీగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ‘గత BRS ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదు. మూసీలో నివసించే ప్రజలకు మంచి జీవితం అందించడానికి మూసీ పక్కనే అందమైన టవర్లు కట్టి అక్కడే ఇళ్లు ఇస్తాం. ఒక్కరోజు మూసీలో పడుకుంటా అని కొందరు వెళ్లారు. పర్మినెంట్గా అక్కడే ఉంటే వాళ్ల బాధలు తెలుస్తాయి. నగర అభివృద్ధి కోసం రూ.10 వేల కోట్లు కేటాయించాం’ అని పేర్కొన్నారు.