AP: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించే తల్లులకు కూటమి ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. 13 వస్తువులతో కూడిన ఎన్టీఆర్ బేబీ కిట్లు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ కిట్లో బ్యాగ్, వాటర్ ప్రూఫ్ షీట్, దోమలతెరతో కూడిన పరుపు వంటి వస్తువులను ఇవ్వనుంది. ప్రభుత్వ ఆసుపత్రి నుంచి బాలింత డిశ్చార్జ్ అయ్యే సమయంలో ఈ కిట్ అందించాలన్నది ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.