రాష్ట్రపతి ప్రసంగంపై లోక్సభలో 14 సార్లు మాట్లాడే అవకాశం కల్పించిన ప్రజలకు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగం ‘వికసిత్ భారత్’ సంకల్పాన్ని బలోపేతం చేస్తోందని అన్నారు. ప్రజలకు కొత్త ఆశను ఇస్తోందని, స్ఫూర్తిగా నిలుస్తోందని పేర్కొన్నారు. తాము నకిలీ నినాదాలు ఇవ్వలేదని, ప్రజలకు నిజమైన అభివృద్ధిని అందించామని వెల్లడించారు.