గాజా కాల్పుల విరమణ ఒప్పందంలో హమాస్ మరో ముగ్గురు బందీలను విడుదల చేసి రెడ్‌క్రాస్‌కు అప్పగించింది. సాగుయ్ డెకెల్ చెన్ (36), అలెగ్జాండర్ ట్రుఫనోవ్ (29), యైర్ హార్న్(46)ను విడుదల చేసినట్లు తెలిపారు. కాల్పుల విరమణను ఇజ్రాయెల్ ఉల్లంఘిస్తుందని ఆరోపిస్తూ.. బందీల విడుదలను ఆలస్యం చేస్తున్నట్లు ఇటీవల హమాస్ ప్రకటించిన విషయం తెలిసిందే.