సరైన ఆహారం తీసుకోవడం వల్ల కిడ్నీ సమస్యలు రాకుండా చూడవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. బీపీ, షుగర్ అదుపులో ఉంచుకోకపోతే కిడ్నీలపై ప్రభావం అధికంగా చూపుతుంది. అలాగే సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, నీరు సరైన మోతాదులో తీసుకోవాలి. వీటితో పాటు ధూమపానానికి దూరంగా ఉండాలి. ధూమపానం అలవాటు ఉన్నవారిలో రక్త ప్రసరణ తక్కువగా ఉంటుంది. దీనికారణంగా కిడ్నీలపై భారం పడి కిడ్నీలకు కేన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.