AP: వైసీపీ పార్టీ ఇవాళ్టి నుంచి 40 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా, ఇవాళ్టి నుంచి నవంబర్ 22 వరకు ‘రచ్చబండ’ కార్యక్రమం నిర్వహించనుంది. నియోజకవర్గ స్థాయిలో ఈ నెల 28న, జిల్లా కేంద్రాల్లో నవంబర్ 12న భారీ ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ ఉద్యమంలో భాగంగా కోటి సంతకాలు సేకరించాలని వైసీపీ లక్ష్యంగా పెట్టుకుంది.