TG: అల్లు అర్జున్ అరెస్టుపై కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందించారు. బన్నీ అరెస్టు తీరు సరికాదని అన్నారు. నేరుగా బెడ్ రూంకి వచ్చి అరెస్టు చేస్తారా?.. దుస్తులు కూడా మార్చుకోనివ్వకుండా అరెస్టు చేస్తారా? అని ప్రశ్నించారు. అల్లు అర్జున్ భారత సినిమాకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చారని పేర్కొన్నారు. తొక్కిసలాట ఘటన పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమని విమర్శించారు. అల్లు అర్జున్‌కు గౌరవం ఇవ్వాలి.. నేరస్థుడిగా చూడొద్దని వ్యాఖ్యానించారు.