US: తన అధ్యక్ష పదవి చివరి రోజుల్లో బైడెన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇటీవలే తన కుమారుడికి క్షమాభిక్ష ప్రసాదించిన ఆయన.. దక్షిణం వైపు ఉన్న సరిహద్దు గోడను స్క్రాప్ కింద అమ్మేస్తున్నట్లు పలు మీడియా కథనాలు పేర్కొన్నాయి. అలాగే ఉక్రెయిన్‌కు కూడా భారీగా ప్యాకేజీలు ప్రకటిస్తున్నారట. మరోవైపు, ట్రంప్ సన్నిహితుడు మస్క్‌కు చెందిన న్యూరాలింక్‌పై సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ కమిషన్ దర్యాప్తును వేగవంతం చేసింది.