జపాన్‌లోని 41 ఏళ్ల షోజి మోరిమోటో ఎలాంటి పని చేయకుండా లక్షల్లో సంపాదిస్తున్నాడు. 2018లో ఉద్యోగం కోల్పోవడంతో తనను తాను అద్దెకు ఇచ్చుకునే బిజినెస్ ప్రారంభించాడు. ఎవరైనా తనను అద్దెకు తీసుకోవచ్చు. నిత్యం తన మొబైల్‌కు 1000 మందికిపైగా ఫోన్ కాల్స్ వస్తాయంటే అర్థం చేసుకోవచ్చు. ఒక్క సెషన్‌కు 65-195 డాలర్లు వసూలు చేస్తాడు. ఏడాదికి 80 వేల డాలర్లు సంపాదిస్తున్నాడు.