రాగి జావ తాగటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. రాగుల్లో కాల్షియం, డైటరీ ఫైబర్ అధికంగా ఉంటాయి. దీన్ని రోజూ తాగటం వల్ల రోగనిరోధక శక్తి, ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి. ఎముకలకు దృఢంగా మారతాయి. జీర్ణ సంబంధిత సమస్యలు రావు. రక్తంలో షుగర్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. రక్తహీనత దరిచేరదు. ఒత్తిడి, డిప్రెషన్, నిద్రలేమి సమస్యలు దూరమవుతాయి.